బీచ్‌రోడ్డు: ఐఐఎం విశాఖపట్నం నిర్వహిస్తున్న ఎం–కెరీర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా.. 44 మంది భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) శాస్త్రవేత్తల బృందం విశాఖపట్నం పోర్టును బుధవారం సందర్శించింది. దేశ వాణిజ్యం, ఆర్థికాభివృద్ధిలో పోర్టుల ప్రాధాన్యత, కార్గో నిర్వహణ, ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలు, లాజిస్టిక్స్, మౌలిక వసతులపై ప్రత్యక్ష అవగాహన పెంచుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా పోర్టు అధికారులు శాస్త్రవేత్తలకు స్వాగతం పలికి, పోర్టు పనితీరును స్వయంగా వివరించారు.


