మహారాణిపేట: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన రేషన్ సరుకులు సకాలంలో అందేలా పర్యవేక్షణ పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్ విద్యాధరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా విజిలెన్స్ కమిటీ సమావేశంలో రేషన్ పంపిణీ, దీపం–2, ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలపై సమీక్షించారు. జిల్లాలో 642 రేషన్ షాపుల ద్వారా 5,28,863 కార్డులకు చెందిన సుమారు 16 లక్షల మందికి సేవలందుతున్నా యని అధికారులు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులకు డోర్ డెలివరీ సేవలను మెరుగుపరచాలని, దీపం–2 ప్రయోజనాలు అర్హులకు అందించాలన్నా రు. ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు


