శ్రావణ శుక్రవారాల్లో లక్ష కుంకుమార్చన | - | Sakshi
Sakshi News home page

శ్రావణ శుక్రవారాల్లో లక్ష కుంకుమార్చన

Aug 13 2026 12:27 AM | Updated on Aug 13 2026 12:27 AM

సింహాచలం: సింహగిరిపై శ్రావణ శుక్రవారాల్లో లక్ష కుంకుమార్చన నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు తెలిపారు. ఈనెల 14, 21, 28, వచ్చే నెల 4వ తేదీల్లో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సింహవల్లీ తాయారు సన్నిధిలో పూజలు జరుగుతాయన్నారు. ఉభయదాతలు రూ.2,500 టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు సహస్రనామార్చన నిర్వహించనున్నట్లు, ఇందుకు రూ.500 టికెట్‌ ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే నెల 11న ఉదయం 6 గంటల నుంచి ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు. పాల్గొనే మహిళలు వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకు సింహగిరిపై పీఆర్‌వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూజా సామగ్రిని దేవస్థానమే అందజేస్తుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement