మహారాణిపేట: హెచ్‌ఐవీ/ఎయిడ్స్, సుఖవ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సురక్ష చైతన్య యాత్ర ప్రచార రథాలను డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు బుధవారం రేసవానిపాలెంలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. 15 రోజుల పాటు జిల్లాలోని మండల కేంద్రాలు, పట్టణాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర ప్రాంతాల్లో వాహనం ద్వారా హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్స, ఉచిత వైద్య సేవలపై అవగాహన కల్పించనున్నారు. గర్భిణీలు తొలి మూడు నెలల్లో హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ‘ఆరోగ్య కరదీపిక‘ పుస్తకాలు, అవగాహన పోస్టర్లను డీఎంహెచ్‌వో ఆవిష్కరించారు.


