మహారాణిపేట: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సిరిపురంలోని హోటల్ టైకూన్‌లో ‘రెమెడీ–
రిఫ్రెష్’ అనే అంశంపై నిరంతర వైద్య విద్యా కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.రాఘవేంద్రరావు మాట్లాడుతూ వైద్యులు నూతన విద్యా ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రెమెడీ–రిఫ్రెష్ అంశంపై డాక్టర్ కె.ప్రీతి, ప్రైమ్ హోమియో ఇన్‌సైట్స్–అత్యవసర పరిస్థితుల్లో హోమియో చికిత్సలపై డాక్టర్ వాకా సునీత, హోమియో లాక్ రెమిడీస్–వాటి విశిష్టత’పై డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. డాక్టర్లు జగదాత్రి, ఆర్. శ్రీదేవి హోమియో మెడి క్విజ్ నిర్వహించారు. వచ్చే నవంబర్‌లో హైదరా
బాద్‌లో జరగబోయే అంతర్జాతీయ హోమి
యోపతిక్ సదస్సు బ్రోచర్‌ను జాతీయ సలహాదారులు కె.శర్మ, జి.రాజేంద్రప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పి.బి.కె.సతీష్, రాష్ట్ర ఉప కార్యదర్శి పి.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి. రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. హోమియో వైద్యులందరూ సదస్సుకు హాజరుకావాలని కోరారు.


