డాబాగార్డెన్స్: నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి బుధవారం ఏపీఎస్‌ఆర్‌టీసీ ద్వారకా బస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన ఆయన ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల భద్రత దృష్ట్యా బస్‌స్టేషన్‌లో ఉమెన్ సేఫ్టీ కియోస్క్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కియోస్క్‌ను సీసీ కెమెరాల పర్యవేక్షణలో, పోలీస్ చెక్‌పోస్ట్‌కు సమీపంలో ఏర్పాటు చేసి, విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది సమన్వయంతో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ద్వారకా బస్‌స్టేషన్‌తో పాటు నగరంలోని ఇతర ప్రధాన స్టేషన్లలో పోలీస్ గస్తీని మరింత పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ బి.అప్పలనాయుడు, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ కె.పద్మావతి, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ గంగాధర్, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి దుర్గాప్రసాద్, వాల్తేర్ డిపో మేనేజర్ కేఎస్‌డీ ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ ఎస్.ఎస్.నాయుడు, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


