ఆ ముగ్గురి నుంచి ప్రాణహాని : కొల్లు శిరీషా | - | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురి నుంచి ప్రాణహాని : కొల్లు శిరీషా

Aug 4 2026 2:11 AM | Updated on Aug 4 2026 2:11 AM

గాజువాక సమీపంలోని భానోజితోట సర్వే నంబర్‌ 86లో ఇల్లు కట్టుకుని 20 ఏళ్లుగా నివసిస్తున్న తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కొల్లి శిరీషా పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోకనాథం, శకుంతల, గురున్నాథం అనే ముగ్గురు వ్యక్తులు డబ్బులు ఇవ్వాలని తమను తీవ్రంగా వేధిస్తున్నారని, ఇవ్వకపోవడంతో బెదిరింపులకు దిగి దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని తెలిపారు. ఈ విషయంపై గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, సీఐ పిలిచినా వారు రావడం లేదని పోలీసులు చెప్తున్నారని పేర్కొన్నారు. భానోజితోట ఏరియాలో డబ్బుల కోసం దందాలు చేస్తూ, గతంలోనూ కేసులున్న ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆమె ఉన్నతాధికారులను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement