యువకుడిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

యువకుడిపై హత్యాయత్నం

Aug 3 2026 4:09 AM | Updated on Aug 3 2026 4:09 AM

కంచరపాలెం: బర్మా క్యాంప్‌ మసీదు సమీపంలో ఆదివారం రాత్రి యువకుడిపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కంచరపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్మా క్యాంప్‌కు చెందిన జశ్వంత్‌ (22), పాల్‌, యశ్వంత్‌ల మధ్య గత కొంతకాలంగా వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం పాల్‌, యశ్వంత్‌లు మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన జశ్వంత్‌ వారిని బెదిరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాత్రి మసీదు సమీపంలో జశ్వంత్‌పై యశ్వంత్‌ కత్తితో దాడి చేశాడు. దీంతో జశ్వంత్‌ శరీరంపై మూడు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కంచరపాలెం పోలీసులు రక్తపుమడుగులో పడి ఉన్న జశ్వంత్‌ను కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన అనంతరం యశ్వంత్‌ను స్థానికుల సహాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ ప్రదీప్తి పర్యవేక్షణలో కంచరపాలెం సీఐ కోరాడ రామారావు దర్యాప్తు చేపట్టారు. తనను జశ్వంత్‌ హత్య చేస్తాడనే భయంతో ముందుగానే కత్తిని వెంట తీసుకెళ్లినట్లు యశ్వంత్‌ విచారణలో చెప్పినట్లు సమాచారం.

పోలీసుల అదుపులో యశ్వంత్‌

కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జశ్వంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement