బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

బళ్లారి రాఘవ సేవలు చిరస్మరణీయం

Aug 3 2026 4:09 AM | Updated on Aug 3 2026 4:09 AM

అల్లిపురం: తెలుగు నాటకరంగానికి బళ్లారి రాఘవ అందించిన సేవలు అమూల్యమని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. ప్రముఖ నాటకకర్త, న్యాయవాది, స్వాతంత్య్ర సమరయోధుడు, నాటక కళాప్రపూర్ణ బళ్లారి రాఘవ (తాడిపత్రి రాఘవాచార్యులు) జయంతి సందర్భంగా ఆదివారం నగర పోలీస్‌ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి సీపీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు నాటకరంగాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన మహనీయుల్లో బళ్లారి రాఘవ ఒకరని కొనియాడారు. కళారంగానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement