విశాఖవిద్య: మాజీ రాజ్యసభ సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఓక్‌ల్యాండ్‌లో నిర్వహించిన సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో ఘనంగా సత్కరించారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయానికి యార్లగడ్డ 14 వేల పుస్తకాలను విరాళంగా అందించారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆ విశ్వవిద్యాలయ గ్రంథాలయానికి ఆయన పేరు పెట్టారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర సంస్థతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను కూడా సన్మానించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిభొట్ల చేతుల మీదుగా ఈ సత్కార కార్యక్రమం జరిగింది.


