అల్లిపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని, ముఖ్యమంత్రి తదితర వీఐపీల రాకపోకల కోసం సుమారు 2 వేల ఆర్టీసీ బస్సులను ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఆయా డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్ సిబ్బంది, సేఫ్టీ డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు, యూనియన్ ప్రతినిధులను రీజినల్ మేనేజర్ బి. అప్పలనాయుడు అభినందించారు. ప్రభుత్వం, ఏపీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నుంచి జిల్లా సిబ్బంది పనితీరుకు ప్రశంసలు లభించడం గర్వకారణమన్నారు. సింహాచలం గిరి ప్రదక్షిణ, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సమర్థవంతమైన రవాణా సేవలు అందించినందుకు ప్రభుత్వం నుంచి ప్రశంసలు దక్కాయని తెలిపారు.


