ఒడిశా భక్తులతో కిక్కిరిసిన
సింహగిరి మాడ వీధులు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం సాయత్రం ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్‌దాస్ గరుడసేవ విశేషంగా నిర్వహింపజేశారు. ఈ సేవకు పెద్ద ఎత్తున హాజరైన ఒడిశా భక్తులతో సింహగిరి మాడ వీధులు కిక్కిరిశాయి. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని విశేషంగా అలంకరించి వెండి గరుడ వాహనంపై వేంజేపచేశారు. సింహగిరి మాడ వీధుల్లో వైభవంగా తిరువీధి నిర్వహించారు. లక్ష్మీకాంత్‌నాయక్‌దాస్ వింజామరతో స్వామికి సేవలందిస్తుండగా ఒడిశా భక్తులు తమ సాంప్రదాయం ప్రకారం స్వామిని కీర్తనలతో కొలిచారు. ఈ సందర్భంగా ఒడిశా భక్తులు చేసిన పలు ప్రదర్శనలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవస్థానం ప్రధానార్చకులు కరి సీతారామాచార్యులు, అర్చకులు చక్రవర్తి తదితరులు ఈ సేవను ఘనంగా నిర్వహించారు.


