మహారాణిపేట: భారతీయ చేనేత వైభవాన్ని, కళాకారుల కథలను ఒకే చోట అందించే ప్రత్యేక అనుభవాత్మక రిటైల్ వేదిక ‘కళా బై కంకటాల’ను శుక్రవారం ప్రారంభించారు. 1940లో కంకటాల అప్పలరాజు ఒక చిన్న దుకాణంతో ప్రారంభించిన ఈ ప్రయాణం, నేడు దేశంలోనే అత్యంత విశ్వసనీయమైన హ్యాండ్లూమ్ చీరల బ్రాండ్‌గా ఎదిగింది. ఈ సందర్భంగా కంకటాల గ్రూప్ చైర్మన్ కంకటాల మల్లిక్ మాట్లాడుతూ.. చీర అనేది కేవలం వస్త్రం కాదు, అది మన భావోద్వేగాల ప్రతిరూపమని, మూడు తరాల తమ అనుభవాన్ని ‘కళా’ ద్వారా పంచుకుంటున్నామని తెలిపారు. ప్రముఖ డిజైనర్ దేవికా నారాయణ్ మాట్లాడుతూ.. ఒక సంప్రదాయ భారతీయ ఇంటిలా ఉండే ఈ ప్రదేశాన్ని సింహాచల నృసింహస్వామి ఆలయ స్ఫూర్తితో నీలిరంగు థీమ్‌తో డిజైన్ చేసినట్లు వెల్లడించారు.


