ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్ వోబీసీ రిటైర్డ్ ఉద్యోగులకు 25 గ్రాముల వెండి నాణేలను పంపిణీ చేశారు. వోబీసీ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 2025 జూలై నుంచి 2026 మార్చి వరకు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ నాణేలను అందజేశారు. ఈ పంపిణీ కార్యక్రమానికి ఓబీసీ లైజన్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, స్టీల్‌ప్లాంట్ ఎస్సీ, ఎస్టీ, వోబీసీ సెల్ ఇన్‌చార్జ్ బాబూ నాయక్‌లు ముఖ్య అతిథులుగా హాజరై, అసోసియేషన్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు బి. అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎస్. శ్రీనివాసరావు, అదనపు ప్రధాన కార్యదర్శి ఆర్.వి. నారాయణ, ఉప ప్రధాన కార్యదర్శి కోయిలాడ శ్రీనివాసరావుతో పాటు యు. శ్రీనివాస్, సింహాచలం, కామేశ్వరరావు, ఎం.ఎన్. ప్రసాద్, నర్శింగరావు, శశిభూషణరావు, ఆర్.సత్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.


