పెదగంట్యాడ: న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కె. శ్యామసుందరి (56) గురువారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. అనకాపల్లి జిల్లాకు చెందిన ఆమె 1992లో కానిస్టేబుల్‌గా పోలీస్ శాఖలో చేరి విశాఖ జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో సేవలందించారు. 2023లో హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది న్యూపోర్టు పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు. గురువారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో బంధువులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందారు. విషయం తెలుసుకున్న న్యూపోర్టు సీఐ తోటాడ కామేశ్వరరావు సిబ్బందితో కలిసి ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.


