డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్‌గార్గ్, అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్యలతో కలిసి బాధితుల నుంచి 105 వినతులను స్వీకరించారు. వీటిలో అత్యధికంగా పట్టణ ప్రణాళిక విభాగానికి 47, ఇంజినీరింగ్ సెక్షన్‌కు 25 ఫిర్యాదులు వచ్చాయి. అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్‌కు 9, రెవెన్యూకు 9, ప్రజారోగ్య విభాగానికి 9, జోనల్ అడ్మినిస్ట్రేషన్‌కు 3, డీడీహెచ్‌కు 2, యూసీడీ విభాగానికి ఒక అర్జీ అందాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గ్రీవెన్స్‌కు వచ్చే ప్రతి అర్జీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేడీ డి.విజయభారతి, ఈఈ సత్యనారాయణరాజు, సీసీపీ ప్రభాకరరావు, సీఎంఓ డాక్టర్ నరేష్‌కుమార్ పాల్గొన్నారు.


