ఓలా, ఉబర్, రాపిడో యాప్‌లలో పనిచేస్తున్న క్యాబ్ డ్రైవర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ విశాఖ క్యాబ్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.యూనియన్ గౌరవ అధ్యక్షుడు బి. జగన్ మాట్లాడుతూ.. ఇంధనం, స్పేర్ పార్ట్స్, బీమా తదితర నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగినా, యాప్ కంపెనీలు డ్రైవర్లకు చెల్లించే ఛార్జీలను పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు జి. శ్రీనివాసు, నాయకులు కె. పోల్ నాయుడు, చంటి, రామారావు, శ్రీనివాసరావు, కృష్ణ, గోపికృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


