తాటిచెట్లపాలెం: ఈ నెల 13న ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా బడ్జెట్‌పై చర్చ–2026(మై భారత్ క్వెస్ట్)లో పాల్గొనేందుకు తాటిచెట్లపాలెంలోని కేంద్రీయ విద్యాలయ(వాల్తేర్) విద్యార్థిని గోగాడ రిషిక ఎంపికై ంది. శనివారం విశాఖ నుంచి రిషిక బయలుదేరింది. వివిధ దశల్లో జరిగిన ఎంపిక ప్రక్రియలో దేశవ్యాప్తంగా 12 లక్షల మంది పైగా యువత పాల్గొనగా.. వీరిలో రాష్ట్రస్థాయిలో ఎంపికై న 14 వేల మంది జాతీయ స్థాయి చర్చలో పాల్గొంటున్నారు. వీరిలో కేవీ వాల్తేర్ నుంచి రిషిక ఎంపికై ంది. ఈ నెల 12, 13 తేదీల్లో గుంటూరు ఆచార్య నాగా ర్జున విశ్వవిద్యాలయంలో జరిగే చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని.. విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాధించే దిశగా యువతను నడిపించడంతోపాటు ఆర్థిక వ్యవస్థపై అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రామం నిర్వహిస్తున్నారు.


