ఎట్టకేలకు కల్యాణ మండపాలకు మోక్షం | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు కల్యాణ మండపాలకు మోక్షం

Apr 12 2026 2:54 AM | Updated on Apr 12 2026 2:54 AM

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం శ్రీనివాసనగర్‌లో రూ.6.7 కోట్లతో నిర్మించిన 4 కల్యాణ మండపాలను శనివారం రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. కల్యాణ మండపాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, విష్ణుకుమార్‌రాజు, అదితి గజపతిరాజు, దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరిజవహర్‌లాల్‌, కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, దేవస్థానం ఈవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. కాగా కల్యాణమండపాలు నిర్మాణం పూర్తిచేసి ఏడాది గడిచినా ఇప్పటి వరకు ప్రారంభోత్సవం జరగకపోవడంతో పలువురు నుంచి విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు కల్యాణమండపాలను ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement