ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్ నిర్మించి పదేళ్లు దాటినప్పటికీ, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో.. నిర్మాణం మధ్యలో మర్రిచెట్టు మొలకెత్తి విస్తరిస్తోంది. సాధారణంగా మర్రి ఊడలు, , రావి చెట్టు వేర్లు భవనాల పునాదులను, రోడ్లను సైతం పిండిచేసేంత బలంగా చొచ్చుకుపోతాయి. ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ చెట్టు ఊడలు వంతెనపై నుంచి కిందకు వేలాడుతూ.. అటుగా వెళ్లే బస్సులు, లారీలను తాకే స్థాయికి చేరుకున్నాయి. ఈ వేర్లు వంతెన కాంక్రీట్ నిర్మాణంలోకి చొచ్చుకుపోతే ఫ్లైఓవర్ దృఢత్వం దెబ్బతిని ప్రమాదం సంభవించవచ్చు. అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. –డాబాగార్డెన్స్/సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


