సామాన్యుడి వాహనంపై నెంబర్ ప్లేట్ మీద చిన్న గీత పడినా చలానా బాదేసే పోలీసులు, మరి తమ వాహనాల పరిస్థితిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఒకవైపు నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని బైక్‌పై సదరు పోలీస్ అధికారి హాయిగా చక్కర్లు కొడుతున్నారు. మరోవైపు కనీసం నెంబర్ ప్లేట్ ఊసే లేని ఎంవీపీ పోలీస్ స్టేషన్ జీపు దర్జాగా రోడ్ల మీద తిరుగుతోంది. నిబంధనలు కేవలం సామాన్యులకేనా? చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఇలా తుంగలో తొక్కుతుంటే, సామాన్య ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? ’నో రూల్స్ – నో ఫైన్స్’ అనేది కేవలం మీకేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. – ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం


