‘పోషణ పక్వాడ’తో ఆరోగ్యకర భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

‘పోషణ పక్వాడ’తో ఆరోగ్యకర భవిష్యత్తు

Apr 10 2026 9:39 AM | Updated on Apr 10 2026 9:39 AM

మహారాణిపేట: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ పోషణ పక్వాడ కార్యక్రమ పోస్టర్‌ను కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ గురువారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పిల్లల మొదటి ఆరేళ్ల జీవన విధానంలో సానుకూల మార్పులు తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా గర్భధారణ నుంచి రెండేళ్ల వరకు ఉండే తొలి 1000 రోజులు శిశువుల శారీరక, మానసిక అభివృద్ధికి అత్యంత కీలకమని, ఈ దశలో సరైన పోషకాహారం, సంరక్షణ అందించడం ద్వారా వారి భవిష్యత్తును మెరుగుపరచవచ్చని పేర్కొన్నారు. కుటుంబాల్లో ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన పెంచడం, చిన్నపిల్లల మెదడు అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం, జన్‌ ఆందోళన్‌ రూపంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశమని వివరించారు. పోషణ పక్వాడలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ స్థాయిలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సుపోషిత జనని–స్వస్థ శిశు అనే అంశంపై తల్లి, శిశు పోషణపై అవగాహన కల్పిస్తామని, తండ్రుల కోసం ప్రత్యేకంగా వర్క్‌షాపులు, సూపర్‌ డాడ్‌ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ రామలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement