డాబాగార్డెన్స్: ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ విశాఖపట్నం ఏరియా కార్యాలయం నూతన ప్రాంగణంలో మారింది. ద్వారకానగర్ ఇస్నార్ ప్లాజా నుంచి తిక్కన రోడ్‌లో గల జీవన్ సమృద్ధి మొదటి అంతస్తులోకి మారిన ఈ కార్యాలయాన్ని సంస్థ సౌత్ ఈస్ట్రన్ రీజియన్ రీజనల్ మేనేజర్ పి.సూర్యనారాయణరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రూ.530 కోట్ల లక్ష్యంతో ఈ శాఖ పనిచేస్తోందని తెలిపారు. దీనిని మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఏరియా మేనేజర్ వినయ్ వైభవ్ మాట్లాడుతూ వ్యాపార బృందాలు నగరంలో పర్యటించి ఇళ్ల వద్దకే సేవలు అందించేలా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా విశాఖ డివిజనల్ మేనేజర్ శారదప్రసాద్‌దాస్, మార్కెటింగ్ మేనేజర్ వి.దివాకరరావు, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ ఎం.దినేష్, విశాఖ క్లస్టర్ హెడ్ సి.అరుణ్, ఆపరేషన్స్ మేనేజర్ పి.హరినారాయణ పాల్గొన్నారు.


