విశాఖలీగల్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవా సదన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం శనివారం నిర్వహించారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.రాధారత్నం, ఒకటో అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఎండీవీఎన్ సింధూర, ఒకటో అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి వి.గంగాభవానీ తదితరులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు ఘనంగా సన్మానించారు. ఒకటో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.వెంకటరమణ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు తదితరులు పాల్గొన్నారు.


