క్రీడలు, సేవ, కళలు.. ఏ రంగమైనా ‘అతివ’లదే అగ్రస్థానం
సముద్రమంత సహనం, ఉప్పొంగే కెరటమంత పట్టుదల.. ఈ రెండింటి అద్భుత కలయికే మన విశాఖ మహిళ. కటిక పేదరికాన్ని, అనారోగ్యాన్ని సైతం చిరునవ్వుతో జయించి.. అవరోధాలనే అవకాశాలుగా మలచుకుంటూ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారీ విజయ విహంగాలు. విశాఖ వీధుల నుంచి ఒలింపిక్స్ ట్రాక్ వరకు, చదరంగం గడుల నుంచి స్కేటింగ్ రింక్ వరకు, సామాజిక సేవ నుంచి సంప్రదాయాల పరిరక్షణ వరకు.. ప్రతి రంగంలోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. తాము గెలవడమే కాకుండా, వేలాది మంది మహిళల్లో ‘మేమూ సాధించగలం’ అనే ఆత్మవిశ్వాసాన్ని రగిలిస్తున్నారు. వీరు అధిగమించిన ఒక్కో హార్డిల్, వీరు గెలిచిన ఒక్కో స్వర్ణం వెనుక ఏళ్ల తరబడి కఠోర శ్రమ, కుటుంబాల మద్దతు, అంతకు మించిసంకల్పబలం ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. నడక నేర్పిన నగరం గర్వపడేలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న విశాఖ మహిళామణుల అసమాన ప్రతిభకు, అలుపెరగని పోరాటానికి అక్షర నీరాజనం.. ఈ కథనం.
విశాఖ
ధీర
వనిత
– విశాఖ స్పోర్ట్స్/మల్కాపురం
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026


