ఒమేగాలో ఘనంగా మహిళా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఒమేగాలో ఘనంగా మహిళా దినోత్సవం

Mar 8 2026 7:17 AM | Updated on Mar 8 2026 7:17 AM

ఆరిలోవ: హెల్త్‌ సిటీలోని ఒమేగా ఆస్పత్రిలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆస్పత్రి మహిళా వైద్యులతో కలిసి ఎండీ డాక్టర్‌ బి.రవిశంకర్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంఘ సేవకురాలు శేషుమాంబతో పాటు కార్గిల్‌ యుద్ధంలో మృతి చెందిన వీర సైనికుల కుటుంబాలలో మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సామాజిక, రాజకీయంగా, ఆర్థిక, విద్యా రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శేషమాంబ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో సీ్త్రలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. వాటిని సీ్త్రలు సమర్ధవంతంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మహిళలు ఆర్యోగం కాపాడుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ శుభకర్‌, డాక్టర్‌ నీలిమ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement