గాల్లో విన్యాసాలు
నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు
అల్లిపురం : నగరంలో శనివారం నిర్వహించనున్న ఎంఆర్‌ఎఫ్ మోగ్రిప్ ఎఫ్‌ఎంఎస్‌సీఐ నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్‌షిప్ రేసింగ్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గాజువాక , కంచరపాలెం మీదుగా కాన్వెంట్ జంక్షన్ వైపు వచ్చే వారు పోర్ట్ లోపల రోడ్డు పక్కన వాహనాలను పార్క్ చేసి, చిలకల జంక్షన్ మీదుగా నడుచుకుంటూ వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పూర్ణా మార్కెట్ , టౌన్ కొత్త రోడ్ నుంచి వచ్చేవారు గోపాల్ ఆటో జంక్షన్ వద్ద ఉన్న జీవీఎంసీ సీవేజ్ వాటర్ ట్యాంక్ వద్ద తమ వాహనాలను పార్కింగ్ చేయాలి. అలాగే నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి డాల్ఫిన్, అద్వానీ మీదుగా కాన్వెంట్ జంక్షన్‌కు వచ్చే వారు కూడా పోర్ట్ లోపల కేటాయించిన స్థలంలోనే వాహనాలను నిలపాలి. కేవలం వీఐపీ, వీవీఐపీ పాసులు ఉన్న వారికి మాత్రమే మున్సిపల్ స్టేడియం లోపల వాహనాల పార్కింగ్‌కు అనుమతి ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు ప్రశాంతంగా సాగేందుకు ప్రజలందరూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గాల్లో విన్యాసాలు
గాల్లో విన్యాసాలు


