ఐఎఫ్‌ఆర్ వేడుకలకు రెడీ
ఆర్.కె.బీచ్ అంతర్జాతీయ నౌకల ప్రదర్శన వేడుకలకు ముస్తాబవుతోంది. ఒకవైపు సముద్ర తీరంలో యుద్ధ నౌకల సందడి నెలకొనగా, మరోవైపు నగర సుందరీకరణ పనులు శరవేగంగా
జరుగుతున్నాయి. ఐఎఫ్‌ఆర్ ఏర్పాట్లలో భాగంగా బీచ్ రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు రంగులు వేస్తూ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక వేడుకల కోసం అటు అధికారులు, ఇటు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
ఐఎఫ్‌ఆర్ వేడుకలకు రెడీ


