సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు | - | Sakshi
Sakshi News home page

సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు

Feb 5 2026 7:10 AM | Updated on Feb 5 2026 7:10 AM

సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు

సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌(ఈవో)గా రెవెన్యూశాఖకు చెందిన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ జె.వెంకటరావు నియమితులయ్యారు. కాకినాడలో డీఆర్‌వోగా పనిచేస్తున్న ఆయన్ని రెవెన్యూ నుంచి దేవదాయశాఖకు డిప్యూటేషన్‌పై బదిలీచేసి, ఏడాది కాలపరిమితికి సింహాచలం ఈవోగా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

హ్యాండ్లింగ్‌లో అదానీ

గంగవరం పోర్టు కొత్త రికార్డు

పెదగంట్యాడ: అదానీ గంగవరం పోర్టు మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఒకేసారి 3,400 టీఈయూలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఈ ఘనత సాధించింది. ఈ సందర్భంగా పోర్టు యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ఎంఎస్‌సీ ట్రేసీ వీ ఒకేసారి నిర్వహించడం తమ సిబ్బంది పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ మైలురాయిని సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమైందని చెప్పారు. అనంతరం సిబ్బందితో కలసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

రేపు నగరానికి

సీఐఎస్‌ఎఫ్‌ సైకిల్‌ ర్యాలీ

మహారాణిపేట: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో చేపట్టిన ‘సీఐఎస్‌ఎఫ్‌ వందేమాతరం కోస్టల్‌ సైక్లోథాన్‌–2026’ఈ నెల 6న ఆర్కే బీచ్‌కు చేరుకుంటుందని సంస్థ సీనియర్‌ కమాండెంట్‌(వీపీటీ) సతీష్‌కుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సైకిల్‌ ర్యాలీకి ఘన స్వాగతం పలికేందుకు ఆర్కే బీచ్‌లో భారీ స్థాయిలో ప్రజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 7న కాకినాడకు సైకిల్‌ యాత్ర కొనసాగుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement