సుజుకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ–ఏక్సిస్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

సుజుకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ–ఏక్సిస్‌ ఆవిష్కరణ

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

సుజుకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ–ఏక్సిస్‌ ఆవిష్కరణ

సుజుకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఈ–ఏక్సిస్‌ ఆవిష్కరణ

బీచ్‌రోడ్డు: సుజుకి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ‘ఈ–ఏక్సిస్‌‘ను సిరిపురంలోని పద్మజ సుజుకి షోరూంలో సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఆర్‌సీహెచ్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా, ఎంవీఐ బుచ్చిరాజు, వరుణ్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వరుణ్‌ దేవ్‌, ఈడీ టి.వినోద్‌కుమార్‌లు గౌరవ అతిథులుగా హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎలక్ట్రిక్‌ వాహనాల ప్రాధాన్యతను వివరించారు. సుజుకి ఈ–ఏక్సిస్‌ ఆధునిక సాంకేతికత, డిజైన్‌, ఫీచర్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. వాహనాన్ని ఒకసారి ఛార్జ్‌ చేస్తే 95 కి.మీ. ప్రయాణించవచ్చన్నారు. మూడేళ్లలోపు విక్రయించేవారి బై బ్యాక్‌ ఆఫర్‌ 80 శాతం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పద్మజ సుజుకి జీఎం రఫీ, సుజుకి ఏరియా సేల్స్‌ మేనేజర్‌ సురేందర్‌, ఏరియా సర్వీస్‌ మేనేజర్‌ సాయి, పద్మజ సుజుకి సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement