జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 129 వినతులు
58 అర్జీలతో పట్టణ ప్రణాళికా విభాగం టాప్!
ఙడాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు 129 వినతులు అందాయి. వీటిలో అత్యధికంగా 58 ఫిర్యాదులు పట్టణ ప్రణాళికా విభాగానివే కావడం విశేషం. పీజీఆర్‌ఎస్‌ను అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ సంయుక్తంగా నిర్వహించారు. అందిన వినతుల్లో జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 9, రెవెన్యూ 14, ప్రజారోగ్య విభాగం 8, ఇంజినీరింగ్ సెక్షన్ 33, హార్టికల్చర్ 4, యూసీడీకి 3 అందాయి. వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ నరేష్‌కుమార్, ప్రధాన సిటీ ప్లానర్ ప్రభాకరరావు, డీసీఆర్ శ్రీనివాసరావు, ఏడీహెచ్ వాసు, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, పర్యవేక్షక ఇంజినీర్లు, డీసీపీలు, ఏసీపీలు, కార్యనిర్వాహక ఇంజినీర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.


