రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆరిలోవ: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణాపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ్బల మహేష్ (37) మృతి చెందాడు. అమలాపురానికి చెందిన మహేష్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్రవాహనంపై బీఆర్‌టీఎస్ రోడ్డులో వెళ్తుండగా, డివైడర్‌పై ఉన్న పూల మొక్కల కొమ్మలు తలకు తగలడంతో బైక్ అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో తల కు తీవ్ర గాయమై మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆరిలోవ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


