
కీచక లెక్చరర్‌కు రిమాండ్
పరవాడ: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్న గుత్తుల శ్రీధర్(56) కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. ఈ నెల 23న మధ్యాహ్నం కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీధర్ సైన్స్ ల్యాబ్‌కు విద్యార్థినిని పిలిపించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. బాధిత విద్యార్థిని ఫిర్యాదు, విద్యార్థినుల వాగ్మూలం ఆధారంగా లెక్చరర్‌పై 24న కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. అనంతరం అనకాపల్లి అడిషినల్ మున్సిప్ కోర్టులో హాజరు పర్చగా ప్రధాన న్యాయమూర్తి వచ్చే నెల 12 వరకు రిమాండ్ విధించగా..అనకాపల్లి సబ్ జైలుకు తరలించినట్టు సీఐ వెల్లడించారు. కేసును పరవాడ మహిళా ఎస్‌ఐ జీవీఎస్ మహాలక్ష్మి దర్యాప్తు చేశారు.