
ప్రతిభ కనబర్చిన డ్రైవర్లు, కండక్టర్లకు మెరిట్ సర్టిఫిక
సింహాచలం: ఆంధ్రప్రదేశ్‌లో ‘సీ్త్రశక్తి’ పథకం ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా కొనసాగుతోందని, ఈ విజయం ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానిది, కార్మికులది అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండలిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సింహాచలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో శుక్రవారం సీసీ కెమెరాలు, తాగునీటి శుద్ధి పరికరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అనంతరం జిల్లాలోని అన్ని డిపోల నుంచి ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లకు మంత్రి మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్టీసి విజయనగరం ఈడీ కె.బ్రహ్మానందరెడ్డి, విశాఖ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు, సింహాచలం డిపో మేనేజర్ శరత్‌బాబు, చీఫ్ ఇన్‌స్పెక్టర్ రమణమూర్తి పాల్గొన్నారు.