
మహిళా క్రికెట్ జట్టుతో లోకేష్ చిట్‌చాట్
విశాఖ స్పోర్ట్స్: మహిళల ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్ జట్టు విశాఖ వేదికగా శిక్షణా శిబిరంలో పాల్గొంటుంది. శుక్రవారం మంత్రి నారా లోకేష్ జట్టు సభ్యులతో చిట్‌చాట్ చేశారు. ఉమ్మడి ఏపీ అంతర్జాతీయ పోటీలకు వేదికగా నిలిచిందన్నారు. క్రీడల్ని ప్రోత్సహించేందుకు మూడు శాతం స్పోర్ట్స్ కోటా అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా క్రీడాకారిణులతో అన్నారు. జట్టు సభ్యులకు శుభాకాంక్షలందించారు. ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్రీడల్లో భారతీయ మహిళల సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు.