
పర్యావరణహితంగా చవితి జరుపుకుందాం
మహారాణిపేట: పర్యావరణానికి హాని చేయని విధంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని కలెక్టర్ హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సౌజన్యంతో కలెక్టరేట్ ఉద్యోగులకు మట్టి వినాయక ప్రతిమలను ఆయన సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పీవోపీ విగ్రహాలను నివారించాలని సూచించారు. చెరువులు, కాలువలు కలుషితం కాకుండా నిమజ్జనం విగ్రహం పెట్టిన చోటే నిర్వహించాలని కోరారు. పీసీబీ సభ్యుడు పంచకర్ల సందీప్, జేసీ కె. మయూర్ అశోక్‌తో కలిసి కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.