కడలిపైకి కదననౌకలు | INS Himgiri and INS Udaygiri Commissioned: India Strengthens Navy with Advanced Stealth Warships | Sakshi
Sakshi News home page

కడలిపైకి కదననౌకలు

Aug 26 2025 9:17 AM | Updated on Aug 26 2025 11:32 AM

 INS Udaygiri and INS Himgiri at Visakhapatnam on August 26
  • నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ హిమగిరి, ఉదయగిరి
  • నేడు జాతికి అంకితం చేయనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
  • ఒకేరోజు రెండు భారీ యుద్ధనౌకల కమిషనింగ్‌ ఇదే తొలిసారి

సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణశాఖ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ.. రెండు భారీ యు­ద్ధనౌకలు మంగళవారం నౌకాదళ అమ్ములపొదిలో చేరనున్నాయి. అత్యాధునిక సాంకేతికతతో నిరి్మ­తమైన నీలగిరి క్లాస్‌లో కీలకమైన ఐఎన్‌ఎస్‌ హి­మగిరి, ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి యుద్ధనౌకలు విశా­­ఖపట్నం వేదికగా జాతికి అంకితం కాను­న్నాయి. అత్యాధునిక ప్రాజెక్ట్‌–17లో భాగంగా మలీ్ట–మిషన్‌ స్టెల్త్‌ ఫ్రిగేట్‌లుగా రూపుదిద్దుకున్న వీటిని విశాఖపట్నంలోని ఐఎన్‌ఎస్‌ సర్కార్‌లో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ త్రిపాఠీ కమిషనింగ్‌ చేయనున్నారు. 

ముంబైలోని మజగాన్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌)లో ఉదయగిరి, కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌–ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)లో హిమగిరి యుద్ధనౌకలు నిర్మించారు. ఆధునిక కంబైడ్స్‌ డీజిల్‌ లేదా గ్యాస్‌ (సీవోడీవోజీ) ప్రొపల్షన్‌ ప్లాంట్లు, అత్యాధునిక ఇంటిగ్రేటెడ్‌ ప్లాట్‌ఫామ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌తో పాటు ఇండియన్‌ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన అత్యాధునిక ఆయు­ధాలు, సెన్సార్ల సూట్స్‌ ఉన్న ఈ నౌకలకు సముద్రజలాల్లో నిర్దేశిత లక్ష్యాలను నూరుశాతం పూర్తిచేయగల సామర్థ్యం ఉంది. హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా సముద్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు, దేశ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఇవి ముఖ్య భూమిక పోషించనున్నాయి. 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ యుద్ధనౌకలు పలు రికార్డులను లిఖించనున్నాయి.

ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి.. నేవీ వార్‌íÙప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన 100వ షిప్‌.  

రెండు వేర్వేరు షిప్‌యార్డ్‌ల్లో నిర్మించిన రెండు ఫ్రంట్‌లైన్‌ సర్ఫేస్‌ యుద్ధనౌకల్ని ఒకేసారి ప్రారంభించడం నౌకాదళ చరిత్రలో ఇదే తొలిసారి.  

భారత షిప్‌యార్డ్‌లు అవలంబించిన మాడ్యులర్‌ నిర్మాణ పద్ధతిలో భాగంగా నిరి్మతమై అత్యంత వేగవంతంగా కమిషనింగ్‌ అవుతున్న యుద్ధనౌక ఉదయగిరి.  

ప్రపంచవ్యాప్తంగా నౌకా నిర్మాణంలో చైనాను భారత్‌ అధిగమించింది. చైనా 19 వార్‌íÙప్స్‌ నిరి్మస్తుండగా.. భారత్‌ నిర్మాణ సంఖ్య 20కి చేరుకుంది.  

ఈ షిప్స్‌ తయారీలో 200 ఎంఎస్‌ఎంఈలు పాల్గొన్నాయి. వీటి నిర్మాణం ద్వారా 4 వేలమందికి ప్రత్యక్షంగా, 10 వేలమందికి పరోక్షంగా ఉపాధి లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement