
సాక్షి, అనకాపల్లి: బాటజంగాలపాలెంలో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్ట్ 14 వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి సొంత కుమార్తెలు, మరిదే హంతకులుగా తేల్చిన పోలీసులు.. మృతురాలు విశాఖలోని కూర్మన్నపాలెం రాజీవ్ నగర్‌కు చెందిన బంకిళ సంతుగా గుర్తించారు.
ఆస్తి తగాదాలు, తల్లిపై కోపంతో చిన్నాన్న సహాయంతో హత్యకు ప్లాన్ చేసిన కూతుర్లు.. ఇంట్లో నిద్రిస్తున్నప్పుడు అర్ధరాత్రి టవల్‌తో మెడ బిగించి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. డెడ్‌బాడీని కారులో తీసుకెళ్లిన నిందితులు.. బాటజంగాలపాలెం దగ్గర ప్రెటోల్ పోసి తగలబెట్టారు.