
జీవీఎంసీ పీజీఆర్‌ఎస్‌కు 114 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 114 వినతులు అందాయి. అదనపు కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ, సిటీ ప్లానర్ మీనాకుమారి ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 55 ఫిర్యాదులు అందాయి. జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 4, రెవెన్యూ విభాగానికి 19, ప్రజారోగ్య శాఖకు 8, ఇంజినీరింగ్ విభాగానికి 19, హార్టికల్చర్ విభాగానికి 3, యూసీడీకి 6 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, డీసీఆర్ ఎస్.శ్రీనివాసరావు, పర్యవేక్షక ఇంజినీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్‌కుమార్, కృష్ణారావు పలువురు అధికారులు పాల్గొన్నారు.