డాబాగార్డెన్స్: వినాయక చవితి వేళ గణపతి విగ్రహాలు వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాయి. సంప్రదాయ రూపాలతో పాటు, సామాజిక అంశాలు, సినిమా పాత్ర లు, ప్రస్తుత ట్రెండింగ్ కాన్సెప్ట్‌ల ఆధారంగా రూపొందించిన విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టితో చేసిన పర్యావరణ హిత గణపతులు ఈ ఏడాది కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి సంవత్సరంలాగే పల్లెటూరి వాతావరణాన్ని, రైతుల కష్టాలను తెలిపే విగ్రహాలు కూడా పూజలకు సిద్ధమయ్యాయి. ఈ సారి గణేష్ మండపాల్లో భిన్నమైన రూపాల్లో ఉన్న గణపతి విగ్రహాలు పండుగకు కొత్త శోభను తీసుకొచ్చాయి.
కార్తీక్ బొమ్మలకు భలే గిరాకీ..
ఒడిశాకు చెందిన ప్రముఖ కళాకారుడు కార్తీక్ తయారుచేసే గణపతి విగ్రహాలకు విశాఖ నగరంలో మంచి గిరాకీ ఉంది. నాలుగు దశాబ్దాలుగా నగర ప్రజలకు సుపరిచితుడైన కార్తీక్, ఆర్డర్ల ఆధారంగా మూడు అడుగుల నుంచి 40–50 అడుగుల ఎత్తు వరకు వివిధ రూపాల్లో విగ్రహాలను రూపొందిస్తుంటారు.ఈయన గణపతిని విశ్వేశ్వరుడు, పరమశివుడు, పార్వతీ పరమేశ్వరుల తనయుడు, అయ్యప్ప స్వామి వంటి వివిధ దైవ రూపాల్లో తీర్చిదిద్దడంలో దిట్ట. అందుకే కార్తీక్ విగ్రహాలంటే నగర ప్రజలు ఎంతగానో ఇష్టపడతారు.
జారుడుబల్లాడుతూ..
మిసైల్‌పై..
రయ్‌మంటూ..
వరసిద్ధి వినాయకుడిగా..
–ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’
అపు‘రూపాలు’