
సచివాలయ ఏఎన్‌ఎంల రిలే దీక్షలు
బీచ్‌రోడ్డు: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు..తమ సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సామూహిక రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహనరావు మాట్లాడుతూ గ్రేడ్ 3 ఏఎన్‌ఎంలకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం ఆరు నెలల క్రితమే నిర్ణయించినప్పటికీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రక్రియ ముందుకు సాగడం లేదని విమర్శించారు. ఇతర శాఖల పనులు అప్పగించి జీతాలు నిలిపివేస్తామని బెదిరింపులకు గురిచేస్తున్నారని, జీవో 124 ప్రకారం ఏఎన్‌ఎంలకు ఆ పనులు అప్పగించకూ డదని స్పష్టంగా ఉన్నా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి జిల్లా విలేజ్ వార్డ్ హెల్త్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు దేవకి మాట్లాడుతూ పదోన్నతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు.యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుభాషిణి మాట్లాడుతూ సచివాలయంలో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు మణి మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జూమ్ మీటింగ్లో ఏఎన్‌ఎంలపై తీవ్ర దుర్భాషలా డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి చుక్కల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు రాము మాట్లాడారు. అనంతరం యూనియన్ ప్రతినిధి బృందం కలెక్టర్ హరేందిరప్రసాద్‌కు వినతిపత్రం అందజేసింది. వారంలోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తర సమస్యలపై యూనియన్‌తో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నారు.