
ఉతికి పిండి ఆరేశారు
కొమ్మాది: ఇటీవల విడుదలైన ‘ఉతుకు, పిండు, ఆరేయ్’ అనే పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, విశేష ఆదరణ పొందుతోంది. మాస్ స్టైల్‌లో సందేశాత్మక లిరిక్స్ ఉండటంతో ఈ పాట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువతను లక్ష్యంగా చేసుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఈ పాట సందేశం ఇస్తోంది. నగరానికి చెందిన 300 మంది కళాకారులతో ఈ పాటను విశాఖ పర్యాటక ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఒకేసారి ఇంతమంది కళాకారులతో చిత్రీకరణ జరపడం ద్వారా ఈ పాట తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. పూర్ణామార్కెట్‌కు చెందిన యాదకుమార్ ఈ పాటకు దర్శకత్వం వహించగా, ధనుంజయ్, నిహారిక ఇందులో నటించారు. పల్సర్ బైక్ రమణ ఈ పాటను ఆలపించగా, నిస్సీ జెస్టిన్ సంగీతం, సందీప్ మిరియాల సాహిత్యం అందించారు. పాటకు లభించిన అనూహ్య స్పందన నేపథ్యంలో, వినాయక చవితి సందర్భంగా బుధవారం దీనికి సంబంధించిన డీజే మిక్సింగ్ పాటను విడుదల చేయనున్నట్లు దర్శకుడు యాదకుమార్ తెలిపారు.

ఉతికి పిండి ఆరేశారు