గుండెపోటుతో చింపాంజీ మృతి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో చింపాంజీ మృతి

Feb 8 2024 12:44 AM | Updated on Feb 8 2024 10:58 AM

- - Sakshi

మృతి చెందిన చింపాంజీ(ఫైల్‌)

విశాఖపట్నం: ఇందిరాగాంధీ జూ పార్కులో చీపా అనే ఆడ చింపాంజీ బుధవారం మృతి చెందింది. దీని వయసు 29 సంవత్సరాలు ఉంటుందని జూ క్యూరేటర్‌ నందనీ సలారియా తెలిపారు. జూ ఆస్పత్రిలో వెటర్నరీ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్డియక్‌ అరెస్టుతో మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టు ప్రకారం వెల్లడైనట్లు ఆమె తెలిపారు. దీన్ని 2016లో ఇజ్రాయిల్‌ జూ పార్కు నుంచి ఇక్కడకు తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఒంటరైన చికిత
ప్రస్తుతం జూ పార్కులో ఉన్న చికిత అనే పేరుగల చింపాంజీ ఒంటరైంది. ఇంతవరకు తోడుగా ఉన్న చీపా మరణించడంతో చికిత ఒక్కటే ఇక్కడ మిగిలింది. 2016లో ఇజ్రాయిల్‌ నుంచి చికో అనే పేరుగల ఒక మగ చింపాంజీ, చీపా, చికిత అనే రెండు ఆడ చింపాంజీలను విశాఖ జూకి తీసుకొచ్చారు. చికో మూడేళ్ల క్రితం మృతి చెందగా బుధవారం చీపా మృతి చెందింది. దీంతో చికిత ఒంటరిగా మిగిలింది.

Advertisement
 
Advertisement
Advertisement