మహారాణిపేట : జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయిలో మంగళవారం నుంచి నిర్వహించే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన పక్షాన ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. బొలిశెట్టి సత్యనారాయణ (విశాఖ తూర్పు), అంగ దుర్గా ప్రశాంతి (విశాఖ పశ్చిమ), పి.శివ ప్రసాద్ రెడ్డి (విశాఖ దక్షిణ), పసుపులేటి ఉషా కిరణ్ (విశాఖ ఉత్తర), రాయపురెడ్డి కృష్ణ (మాడుగుల), చెట్టి చిరంజీవి (అరకు), వెంపరు గంగులయ్య (పాడేరు), పంచకర్ల రమేష్‌బాబు (పెందుర్తి), పంచకర్ల సందీప్ (భీమిలి), కోన తాతారావు (గాజువాక), పీవీఎస్‌ఎన్ రాజు (చోడవరం), పరుచూరి భాస్కరరావు (అనకాపల్లి), సుందరపు విజయకుమార్ (యలమంచలి), గెడ్డం బుజ్జి (పాయకరావుపేట), ఆర్.సూర్యచంద్ర (నర్సీపట్నం)ను నియమించారు.