బషీరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా కల్పించేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని అమలు చేయనుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 19న పథకాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలో ఒక సంపాదనపరుడికి రూ.5 లక్షల బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒకటి కంటే ఎక్కువ మంది సంపాదనపరులు ఉన్న కుటుంబాల్లో ఎవరికి బీమా చేయించుకోవాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చన్నారు. కులం, మతం, ఆదాయ భేదం లేకుండా పథకాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. నవంబర్ 20 నుంచి 30 వరకు గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. మంగళవారం బషీరాబాద్‌లో నూతన పింఛనుదారులకు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. పింఛన్ల మంజూరు కోసం ఎవరైనా డబ్బులు అడిగితేసంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తేలితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
అర్హులందరికీ చేయూత: కలెక్టర్
జిల్లాలో చేయూత పింఛన్ల కోసం 17,395 దర ఖాస్తులు అందాయని కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 14,771 మందికి మంజూరు చేసినట్లు వెల్లడించారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పథకం వర్తింపజేస్తామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలా లు వేగంగా అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబరు నెలలోనే జిల్లాలో ఆరు మీటర్ల మేర పడిపోయిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇళ్ల వద్ద, పొలాల్లో, బోరుబావుల సమీపంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కొత్త బోర్లు వేయకుండా ఇప్పటికే ఉన్న బోర్లను మరమ్మతు చేసుకోవాల ని కోరారు. అంతకుముందు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ సభకు వచ్చిన సరిహద్దు కర్ణాట క గ్రామాల ప్రజలను ఉద్దేశించి కన్నడలో మా ట్లాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో తాండూ రు ఆర్డీవో అనిత, పీఏసీఎస్ చైర్‌పర్సన్ కరుణ, ఏఎంసీ వైస్ చైర్మన్ శంకరప్ప, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ మహరాజ్, సొసైటీ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీఓ సంపత్‌కుమార్, తహసీల్దార్ షాహేదాబేగం, నాయకులు మాధవరెడ్డి, అజయ్‌ప్రసాదవ్, వెంకట్‌రామ్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, రామునాయక్, రాజవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


