జాతరకు రండి | - | Sakshi
Sakshi News home page

జాతరకు రండి

Nov 18 2026 11:07 AM | Updated on Nov 18 2026 11:07 AM

● ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ● లబ్ధిదారులకు చేయూత ప్రొసీడింగ్‌ పత్రాల అందజేత

స్పీకర్‌ను ఆహ్వానించిన

ఆలయ ట్రస్టీ పద్మనాభం

అనంతగిరి: అనంతపద్మనాభ స్వామి కార్తీక మాస జాతరకు రావాలని ఆలయ కమిటీ సభ్యులు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కోరారు. మంగళవారం ఆయన్ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని వారు తెలిపారు. స్పీకర్‌ను కలిసిన వారిలో ట్రస్ట్రీ పద్మనాభం, ఈఓ నరేందర్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, రాములు యాదవ్‌ తదితరులు ఉన్నారు.

పదివేల ఇళ్లు నిర్మిస్తేనే

మళ్లీ పోటీ చేస్తా

పరిగి: నియోజకవర్గంలో పదివేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తేనే తాను మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, లేకుంటే పోటీలో ఉండనని ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం పరిగి పట్టణంలో నూతన లబ్ధిదారులకు చేయూత పెన్షన్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిగికి మొదటి విడతలో 3,500 ఇండ్లు మంజూరు చేశామని గుర్తు చేశారు. రెండో విడతకు సంబంధించిన జాబిత సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. వచ్చే ఎన్నికల నాటికి పదివేల ఇళ్లు మంజూరు చేసి తీరుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రజిత, పీఏసీఎస్‌ చైర్మన్‌ పార్థసారథి పంతులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పరశురాంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అయూబ్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వెంకట్‌రాములు, రామకృష్ణారెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ మల్లేశ్‌, ఎంపీడీఓ హరిప్రియరెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రైతు ఇంట్లో చోరీ

ధాన్యం డబ్బు ఎత్తుకెళ్లిన దొంగలు

తాండూరు రూరల్‌: రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన మండలంలోని చిట్టిఘనాపూర్‌లో మంగళవారం వెలుగుచూసింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సంకు రమేష్‌ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లాడు. ఇంటికి రెండు వైపులా డోర్లు ఉండటం ఒక దానికి మాత్రమే తాళం వేశాడు. దొంగలు ఇంట్లో చొరబడి బీరువాలోని రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. వారం రోజుల క్రితం వడ్లు విక్రయించగా వచ్చిన డబ్బును బీరువాలో ఉంచినట్లు రైతు రమేష్‌ తెలిపారు. మంగళవారం కరన్‌కోట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని క్లూజ్‌ టీంతో ఆధారాలు సేకరించారు. ఇప్పటి వరకు గ్రామంలో మూడు ఇళ్లలో చోరీలు జరిగినట్లు సర్పంచ్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. దొంగలను పట్టుకోవాలని కోరారు.

గోసంరక్షణకు సహకారం

మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్‌: గోవుల సంరక్షణ, గోశాలల పరిరక్షణ కోరుతూ యుగ తులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన శ్రీగో సడక్‌ బంద్‌శ్రీ ప్రశాంతంగా ముగిసింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన రైతులు, గోసంరక్షకులు, గో ప్రేమికులు పోలీసులకు తమ విజ్ఞప్తులను తెలిపారు. మండలంలోని జాఫర్‌గూడలో యుగతులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గోశాలలను మహేశ్వ రం జోన్‌ డీసీపీ నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గోవుల అక్రమ రవాణాపై పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, యుగ తులసి ఫౌండేషన్‌ చైర్మన్‌ శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. గోశాలల సమస్యలపై త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పూర్తి నివేదికలను ప్రభుత్వానికి సమర్పించి శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్‌ హామీ ఇచ్చారని శివకుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement