బంట్వారం/మర్పల్లి/అనంతగిరి: ఎల్‌నినో ప్రభా వంతో ఏర్పడిన కరువును సమర్థవంతంగా ఎదుర్కొందామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నా రు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని పేర్కొన్నారు. మంగళవారం బంట్వారం, కోట్‌పల్లి మండలాల్లో లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నేపథ్యంలో నీటిని, కరెంటును పొదుపుగా వాడుకోవాలని మహిళలకు సూచించారు. తిండి గింజలకు కరువు రానియ్యమన్నారు. నియోజకవర్గ ప్రజలకు 24గంటలు అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా వికారాబాద్‌లోని క్యాంప్ కార్యాలయంలో కలవొచ్చని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ అందిస్తున్నామన్నారు. మహిళలను లక్షాధికారులను చేసేలా వైఎస్‌ఆర్ పాలన సాగిందని, నేడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదేబాటలో నడుస్తున్నారని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తుమన్నారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పటికీ ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలను నమ్మకూడదన్నారు. కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మర్పల్లి, కోట్‌పల్లి ఏఎంసీ చైర్మన్లు మహేందర్‌రెడ్డి, రమావత్ అనిత, డీసీసీ కార్యదర్శి పోచారం వెంకటేశం, పార్టీ మండల అధ్యక్షులు పురుషోత్తంరెడ్డి, రాంచంద్రారెడ్డి, ఎంపీడీఓలు రాములు, హేమంత్, తహసీల్దార్లు ఆనంద్‌రావు, విజయ్ కుమార్, ఎంపీఓ నాగరాజు, సర్పంచ్‌లు, నాయకులు రమేష్ నాయక్ పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ప్రజా ప్రభుత్వంలో పేదల పింఛను కల సాకారమవుతోందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. మంగళవారం మర్పల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు చేయూత పథకం ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలు అనే ఇబ్బందులు పడ్డారని తెలిపారు.పథకాలు సక్రమంగా అమలు చేయలేదనిఆరోపిం చారు. కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా సాగుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు సురేష్, సీనియర్ నాయకులు రాములు యాదవ్, కృష్ణారెడ్డి, రవీందర్, శంకరయ్య గౌడ్, శేఖర్ యాదవ్, నర్సింలు యాదవ్, సర్వేశ్, సర్పంచుల ఫోరం మండల అధక్షుడు రఫీ, సర్పంచ్ రామేశ్వర్, ఎంపీడీఓ శాంత, తహసీల్దార్ మణోహర్ చక్రవర్తి, ఏపీఓ అంజీరెడ్డి, ఏపీఎం సమయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదల అభ్యున్నతే ధ్యేయం
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి గార్డెన్‌లో చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మేకల గండిలో రూ.200 కోట్లలో స్కూల్ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అనన్య, వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


