కదలని రిజిస్ట్రేషన్లు | - | Sakshi
Sakshi News home page

కదలని రిజిస్ట్రేషన్లు

Sep 27 2026 2:15 PM | Updated on Sep 27 2026 2:15 PM

తాండూరు: పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో శనివారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఉదయం 10 గంటలకు విధులకు రావాల్సిన సిబ్బంది పత్తాలేకపోవడంతో ఫైళ్లు ముందుకు కదలలేదు. రిజిస్ట్రేషన్‌ల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందని పలువురు కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న వారు సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. కానీ, మరుసటి రోజే జూనియర్‌ అసిస్టెంట్లు, సిబ్బంది సకాలంలో ఆఫీసుకు చేరకపోవడం చర్చనీయాంశమైంది.

సమయ పాలన పాటించని సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement