డీఐఈఓ శంకర్‌నాయక్
మోమిన్‌పేట: విద్యార్థులు కళాశాలలో వంద శాతం హాజరుతో ఆదర్శంగా నిలవాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి(డీఐఈఓ) శంకర్‌నాయక్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైన్సు విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రయోగాలు నిర్వహించాలని, ఆర్ట్స్ విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మ్‌ంట్ నిర్వహించాలని సూచించారు. ప్రతి రోజు నిర్వహించే డిజిటల్ బోర్డు ద్వారా అత్యాధునికమైన తరగతులను వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరెడ్డి, ఆధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి కవిత
బొంరాస్‌పేట: రైతు నమోదును పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి కవిత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతు నమోదు ప్రక్రియను ఆమె తనిఖీ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, రాయితీలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరియని చెప్పారు. సంబంధిత క్లస్టర్ పరిధిలోని ఏఈఓల వద్ద ఈనెల 30 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఆమె వెంట వ్యవసాయ సహాయ సంచాలకులు వెంకటేశం, మండల వ్యవసాయధికారి కరుణాకర్‌రెడ్డి, ఏఈఓలు స్వాతి, హేమలు తదితరులున్నారు.
డీఎంహెచ్‌ఓ సుధాకర్‌లాల్
బొంరాస్‌పేట: పరిశుభ్రతతో రోగాలు దరిచేరవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.సుధాకర్‌లాల్ అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని బొట్లోనితండా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని కిచెన్, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. భోజన సమయంలో పరిశుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఆహార పదార్థాలు నిల్వ ఉంచకుండా, పారిశుద్ధ్యం లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ శిబిరంలో 350 మంది విద్యార్థినులకు పరీక్షించగా 36 మందికి కంటి సమస్యలున్నట్లు గుర్తించారు. ఈ కార్యక్రమంలో హేమంత్‌కుమార్, ఆర్బీఎస్‌కే వైద్య బృందం, పాఠశాల హెచ్‌ఎం విక్రమ్‌సింగ్, ఉపాధ్యాయులున్నారు.
‘టీయూడబ్ల్యూజే హెచ్143’ జిల్లా మహాసభలు నేడు
బొంరాస్‌పేట: జిల్లా కేంద్రంలోని శివకేశవ బాంక్వెట్ హాలులో ఆదివారం ఉదయం 11గంటలకు టీయూడబ్ల్యూజే హెచ్143 యూనియన్ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా కో కన్వీనర్ ప్రహ్లాదచారి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన సంఘం నాయకులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్‌రెడ్డి చేతుల మీదుగా వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వీబీజీ రామ్‌జీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నర్సింలుగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ జయకృష్ణ, మల్లికార్జున్, నర్సింలు నాయుడు, కృష్ణ, యూనియన్ నాయకులున్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి ఆదుకోవాలని తులేకలాన్ పంచాయతీ పాలకవర్గం కలెక్టర్‌ను కోరింది. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఆశ్వినీ రవీందర్, ఉప సర్పంచ్ జగదీశ్ మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, వీధి దీపాల కోసం నిధులు కేటాయించాలన్నారు.


