● కలెక్టర్ దీపక్ తివారి
● పరిగి, తాండూరు ఎమ్మెల్యేలతో కలిసి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం
అనంతగిరి: సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు అభినందనీయమని.. విద్యార్థుల భవిష్యత్ తీర్చిదిద్దడంలో వారి పాత్ర కీలకమని కలెక్టర్ దీపక్‌తివారి అన్నారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవనం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న వారికి శనివారం కలెక్టరేట్‌లో సన్మాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, బుయ్యని మనోహర్‌రెడ్డితో కలిసి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులను ఉత్తమ పౌరుల తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ ఉత్తమ పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైతిక విలువలు, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల తలరాత మార్చేది విద్య మాత్రమేనని.. దీనికి దశదిశను నిర్దేశించే శక్తి ఉపాధ్యాయులకే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రెఇయనీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్ గుట్టూరు, ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రంగరాజు , మున్సిపల్ వైస్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, డీఈఓ మహమ్మద్ అబ్దుల్ ఘని, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


